మంచి దేవుడు నా యేసయ్యా - manchi devudu na yesayya song lyrics

మంచి దేవుడు నా యేసయ్యా 
చింతలన్నీ బాపునయ్యా 
హృదయ వాంఛతో చేరిన వారికి 
శాంతి జీవము నిచ్చునయా (2) 
మహిమా ఘనతా ప్రభావములు నీకే (2) 

కృపల వెంట కృపలు చూపి 
విడువక నీ కృపలను చూపిన (2) 
కృప గల నా యేసు రాజా 
నీ కృపా నాకు చాలనయా (2)              " మహిమా " 

మహిమ వెంట మహిమ చూపి 
నీ రూపమున నన్ను మార్చి (2) 
మహిమ తో నీవుండు చోటికి 
మమ్ము ప్రేమ తో పిలిచితివి (2)           " మహిమా " 

జయము వెంట జయము నిచ్చి 
జయ జీవితము నాకు ఇచ్చి (2) 
జయశీలుడు నా యేసు ప్రభువని 
జయము జయమని పాడెదను (2)     " మహిమా " 

Comments

Popular Posts