మానవుడా కారణజన్ముడా -- manavuda karanajanmuda song lyrics

మానవుడా కారణజన్ముడా 
నీ జన్మకు కారణముంది (2)
అర్ధము తెలియక నీవు వ్యర్ధం గా బ్రతుకకు 
పరమార్ధమున్నదని ప్రభు కొరకే బ్రతకమని (2) 


పువ్వులెందుకు ? కాయలెందుకు ? 
ఋతువులెందుకు  ? కాలాలెందుకు (2) 
ఉన్నవన్ని నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని
గమనించి తెలుసుకో గ్రహియించి మసలుకో 
నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది 
                                                 " మానవుడా " 

సూర్యుడెందుకు ? చంద్రుడెందుకు ? 
రాత్రులెందుకు ? పగలు ఎందుకు ? 
రాత్రి పగలు దేవుడే చేసెనని 
ఆ దేవుని పని నీవు చేయాలని 
ప్రభువుని ప్రకటించి పాపిని రక్షించి 
పరలోకం చేర్చాలని పరలోకం చేర్చాలని 
                                              " మానవుడా " 

Comments

Popular Posts