మహిమ నీకే ప్రభూ - mahima neeke prabhu song lyrics
మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ
మహిమ ఘనత మహిమయు
ప్రభావము నీకే ప్రభూ (2)
ఆరాధన ఆరాధన (2)
ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే (2)
సమీమించరాని - తేజస్సులో నీవు -
వసియించు అమరుండవే (2)
శ్రీమంతుడవే - సర్వాధిపతివే -
నీ సర్వము నాకిచ్చితివే (2) " ఆరాధన "
ఎంతో ప్రేమించి - నాకై ఏతెంచి -
ప్రాణమునర్పించితివే (2)
విలువైన రక్తం - చిందించి నన్ను -
విమోచించితివే (2) " ఆరాధన "
ఆశ్చర్యకరమైన - నీ వెలుగులోనికి -
నను పిలిచి - వెలిగించితివే (2)
నీ గుణాతిశయముల్ - ధరనే ప్రచురింప -
ఏర్పరచుకొంటివే (2) " ఆరాధన "
రాజులైన యాజక - సమూహముగా -
ఏర్పరచబడిన వంశమై (2)
పరిశుద్ధ జనమై - నీ సొత్తైన ప్రజగా -
నన్ను చేసితివే (2) " ఆరాధన "
Comments