మహా ఘనుడవు - maha ghanudavu song lyrics

మహా ఘనుడవు మహోన్నతుడవు 
పరిశుద్ధ స్థలము లోనే నివసించువాడవు (2) 
కృపా సత్య సంపూర్ణమై 
మా మధ్యలో నివసించుట న్యాయమా
నను పరిశుద్ధ పరచుటే నీ  ధర్మమా (2) 

వినయము గలవారిని 
తగిన సమయములో  హెచ్చించువాడవని  (2) 
నీవు వాడు పాత్రనై నేనొండుటకై 
నిలిచి యుండును పవిత్రతతో (2)
హల్లెలుయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)   " మహా "

దీన మనస్సు గలవారిని 
సమృద్ధి గా కృపను దయచేయు వాడవని (2) 
నీ సముఖము లో సజీవ సాక్షినై 
కాపాడుకొందును మెలుకువ తో (2) 
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) " మహా " 

శోధింప బడువారికి 
మార్గము చూపించి తప్పించు వాడవని (2) 
నా సిలువ మోయుచు నీ సిలువ నీడను 
విశ్రమింతును అంతము వరకు (2)
హల్లెలుయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) " మహా " 

Comments

Popular Posts