మాధుర్యమే నా ప్రభుతో - madhuryame song lyrics
పల్లవి :
మాధుర్యమే నా ప్రభు తో జీవితం మహిమానందమే మహా ఆశ్చర్యమే (2)
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
చరణం 1:
సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు
వారి అందమంతయు - పువ్వువలే
వాడి పోవును - వాడి పోవును (2)
" మాధుర్యమే "
చరణం 2:
నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటే (2)
దేవుని యందలి భయక్తులతో
ఉండుటే మేలు - ఉండుటే మేలు (2)
" మాధుర్యమే "
చరణం 3:
వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను (2)
తేజోవాసుల పరిశుద్ధులతో
ఎపుడు చేరేదనో - ఎపుడు చేరేదనో (2)
" మాధుర్యమే "
Comments