మధురమైనది నా యేసు ప్రేమ - madhuramainadhi na yesu prema song lyrics

మధురమైనది నా యేసు ప్రేమ 
మరపురానిది నా తండ్రి ప్రేమ (2) 
మరువలేనిది నా యేసుని ప్రేమ (2) 
మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ 

ప్రేమా .. ప్రేమా .. ప్రేమా .. 
నా యేసుని ప్రేమ (2)                " మధుర " 

చరణం 1 : 
ఇహ లోక ఆశలకు అంధుడనేనైతిని 
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2) 
చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి (2)
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం          " ప్రేమా " 

చరణం 2 : 
పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పినా 
ఎగసి పడే అలల తో కడలే గర్జించినా (2) 
మరణపు ఛాయలే దరిచేర నీయక (2) 
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం                " ప్రేమా " 




Comments

Popular Posts