బ్రతకాలని ఉన్నా - brathakalani unna song lyrics

బ్రతకాలని ఉన్నా బ్రతకాలేకున్నా 
నిలవాలని ఉన్న నిలవలేకున్నా (2) 
చూడాలని ఉన్న  చూడలేకున్న 
చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా 
బ్రతికించుమో యేసయ్యా 
దరిచేర్చుమో నన్నయా (2)             " బ్రతకాలని " 

కాపరి లేని గొర్రెనైతి - కాటికి నే చేరువైతి 
కావలి లేని తోటనైతి - కారడవిగా నే మారితి 
గూడు చెదరని గువ్వనైతి - గుండె పగిలిన ఏకాకినైతి 
గుండె దిగులుగా ఉందయ్యా 
గూడు చేర్చుమో యేసయ్యా (2)    " బ్రతకాలని " 


నా ఆశలే అడియాశలై - అడుగంటెనే నా జీవితం 
శోధనల సుడివడిలో - తొట్రిల్లెనే నా జీవితం 
చుక్కాని లేని నావనైతి - గమ్యము తెలియక అల్లాడుచుంటి 
గురి చేర్చుమో యేసయ్యా 
గుండె గుడిలో నీవుండయ్యా (2)    "బ్రతకాలని " 










Comments

Popular Posts