ప్రార్ధన వినెడి పావనుడా - prardhana vinedi pavanuda song lyrics

ప్రార్ధన వినెడి పావనుడా 
ప్రార్ధన మాకు నేర్పుమయా (2)   

శ్రేష్ఠమైన భావము గూర్చి 
శిష్య బృందముకు నేర్పితివి (2) 
పరముడ నిన్ను ప్రణుతించెదము (2) 
పరలోక ప్రార్ధన నేర్పుమయా (2)           " ప్రార్ధన "

పరమ దేవుడవని తెలిసి 
కరములెత్తి జంటగా మోడ్చి (2) 
శిరమును వంచి సరిగను వేడిన 
సుంకరి ప్రార్ధన నేర్పుమయా (2)          " ప్రార్ధన " 

దిన దినమంబు చేసిన సేవ 
దైవ చిత్తముకు సరిపోవ (2) 
దీనుడవయ్యి దిటముగా కొండను 
చేసిన ప్రార్ధన నేర్పుమయా (2)            " ప్రార్ధన "

శత్రు మూక నిన్ను చుట్టుకొని 
సిలువ పైన నిను జంపగను (2) 
శాంతముతో నీ శత్రుల బోవగా 
నలిపిన ప్రార్ధన నేర్పుమయా (2)         " ప్రార్ధన "


Comments

Popular Posts