ప్రార్ధన శక్తి నాకు కావలయ్యా - prardhana shakthi naku song lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా 
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) 
యేసయ్యా మాకు కావాలయ్యా 
నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా (2)          " ప్రార్ధన "

ఏలీయా ప్రార్ధించగా పొందిన శక్తి 
నేను ప్రార్ధింపగా దయ చేయుమా (2)
ప్రార్ధించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్ధింప కృప నీయుమా (2)    " ప్రార్ధన " 

సింహాల గుహ లోని దానియేలు శక్తి 
ఈ లోకం లో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2) 
నీ సిలువను మోసే కృప నీయుమా (2)   " ప్రార్ధన " 

పేతురు ప్రార్ధింపగ నీ ఆత్మను దింపితివి 
నే పాడు చోటెల్లా దిగిరా దేవా (2) 
చిన్న వయసులో అభిషేకించిన యిర్మీయా వలే (2)
ఈ చిన్న వాడిని అభిషేకించుమా (2)     " ప్రార్ధన " 

Comments

Popular Posts