ప్రభువా నీలో జీవించుట - prabhuva nelo song lyrics

ప్రభువా నీలో జీవించుట  (2)
కృపా బాహుళ్యమే నా ఎడ 
కృపా బాహుళ్యమే (2)                          " ప్రభువా " 

సంగీతములాయే 
పెను తుఫానులన్నియు (2) 
సమసి పోవునే నీ నామ స్మరణ లో (2)
సంతస మొందె నా మది ఎంతో (2)         " ప్రభువా "

పాప నియమమును 
బహు దూరముగా చేసి (2)
పావన ఆత్మతో పరిపూర్ణమైన (2) 
పాద పద్మము హత్తుకొనెదను (2)           " ప్రభువా "

నీలో దాగినది 
కృప సర్వోన్నతముగా  (2) 
నీలో నిలిచి కృపలనుభవించి (2)
నీతోనే యుగయుగములు నిలచెద (2)   " ప్రభువా " 

నూతన వధువునై 
శుద్ధ వస్త్రములుధరించి (2) 
నూతనమైన  శుభాకాంక్షల తో  (2)
నూతన షాలేమై సిద్ధమౌదు నీకై (2)       " ప్రభువా " 



Comments

Popular Posts