పరిశుద్ధ పరిశుద్ధ - parishuddha

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా 
వరదూత లైన నిన్ వర్ణింపగలరా (2)
వరదూత లైన నిన్ .. (3) 
వర్ణింపగలరా 

పరిశుద్ధ జనకుడా - పరమాత్మరూపుడా (2)
నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావా 
నిరూపమ బలబుద్ధి .. (3) నీతి ప్రభావ  

పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడా (2)
నరులను రక్షించు కరుణా సముద్ర 
నరులను రక్షించు.. (3) కరుణా సముద్ర 

పరిశుద్ధ మగునాత్మ - వరములిడు నాత్మ (2)
పరమానంద ప్రేమ భక్తుల కిడుమా 
పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా 

జనక కుమారాత్మ లనునేక దేవా (2)
ఘన మహిమ చెల్లును - దనరా నిత్యముగా 
ఘన మహిమ చెల్లును (3) ధనరా నిత్యము గా 





 

Comments

Popular Posts