దినదినంబు - dhina dhinambu song lyrics
దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2)
ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2)
పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2)
" దిన "
మారి పోయే లోకమందు మనుజులెంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2)
" దిన "
ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము
ప్రభువే నాకు అభయము భయపడను నేనేమాత్రమును
" దిన "
దైవ వాక్యం జీవ వాక్యం అనుదినం చదువుతా
ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2)
" దిన "
పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెద (2)
సిలువమోసి సేవచేయ యేసు తోనే కదులుతా (2)
Comments