దేవుని స్తుతియించుడి - devuni sthuthiyinchudi song lyrics

దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడూ 
దేవుని స్తుతియించుడి

ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో .. ఆ .. ఆ .. (2)          " ఎల్లప్పుడు " 

ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకాశ విశాలమందు .. ఆ .. ఆ .. (2)      " ఎల్లప్పుడు " 

ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును .. ఆ .. ఆ .. (2)   " ఎల్లప్పుడు " 

బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో .. ఆ .. ఆ .. (2)   " ఎల్లప్పుడు " 

సన్నని తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో .. ఆ .. ఆ .. (2)    " ఎల్లప్పుడు " 

తంబుర తోను నాట్యము తోను (2)
తంతి వాద్యము లతో .. ఆ .. ఆ .. (2)  " ఎల్లప్పుడు " 

పిల్లన గ్రోవిని చల్లగ నూది  (2)
ఎల్ల ప్రజలు చేరి .. ఆ .. ఆ .. (2)          " ఎల్లప్పుడు " 

మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో .. ఆ .. ఆ .. (2)     " ఎల్లప్పుడు " 


సకల ప్రాణులు యెహోవాన్ స్తుతించుడి (2)
హల్లెలూయ ఆమెన్ .. ఆ .. ఆ .. (2)   " ఎల్లప్పుడు" 






Comments

Popular Posts