త్రాహిమాం క్రీస్తు నాధ - thrahimam kreesthu nadha song lyrics

త్రాహిమాం క్రీస్తు నాథా - దయ చూడరావే 
నేను - దేహి యనుచు నీ పాదములే - దిక్కుగా జేరితి నిపుడు 

చరణం 1 : 
గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుడనై 
రవ్వపాలైనేనెంతో నెవ్వ బొందితి 
త్రవ్వుచున్న కొలది - పెరుగు -తరగదు నా పాపరాశి 
ఇవ్విధమున చెడిపోతిని నేనేమి సేతు నోహోహోహో 

చరణం 2 : 
నీయందు భయ భక్తులు లేని - నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు చేసినా డను
దయ్యాల రాజు చేతిలో - చేయి వేసి వాని పనుల 
చేయ సాగి నే నిబ్బంగి చెడిపోయితి నే నయ్యయ్యయ్యో

చరణం 3 : 
నిబ్బర మొక్కించుకైనా - నిజము రవ్వంతైన లేక 
దబ్బరలాడుటకు ము - త్తాత నైతిని 
అబ్బురమైన ఘోర పా - పాంధ కార కూపమందు 
డబ్బున పడిపోతి నయ్యో - దారి చెడి నే నబ్బబ్బబ్బా

చరణం 4 : 
నన్ను చేరి సాటి లేని - నిత్యానంద మందబోవు 
చున్నప్పుడు నిందలు నా - కెన్ని చేరినా 
విన్నదనము లేకుండా నీ - వే నా మదికి ధైర్యమిచ్చి
యాన్నిట రక్షించిచితివి నా - యన్న నీకు స్థోత్ర మహహా 

 


Comments

Popular Posts