తొలకరి వాన - tholakari vaana song lyrics

తొలకరివాన దీవెనలు కురిపించువాన 
పరిద్ధాత్మ వాన ప్రభువర్షించు నీ జీవితాన (2)
అది నూతన పరచును ఫలియింప చేయును 
సమృద్ధి నిచ్చును సంతోష పరచును        " తొలకరి " 

ఎడారివంటి  బ్రతుకును సారముగా చేయును 
జీవ జలములతో నింపి జీవింప జేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధి తో నింపును
                                                   " అది నూతన "

సత్య స్వరూపి శుద్ధాత్మ నీలో వసియించును 
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)
యేసు కొరకు నిజ సైనికునిగా - సజీవ సాక్షిగా నిలుపును
                                                   " అది నూతన " 
                   

Comments

Popular Posts