ధవళవర్ణుడా - dhavalavarnuda song lyrics

ధవలవర్ణుడా రత్నవర్ణుడా 
పదివేలలో అతి ప్రియుడా 
అతి కాంక్షనీయుడా  (2)
ఎందకయ్యా మాపై ప్రేమ 
ఎందుకయ్యా మాపై కరుణా  (2)

ఘోర పాపినైన నన్ను
లోకమంతా వెలివేసినా 
అనాధగా ఉన్న నన్ను 
ఆప్తులంతా దూషించగా (2)
నీ ప్రేమ నన్నాదుకొని 
నీ కరుణ నన్నోదార్చెను (2)             " ధవళ "

గాయములతో ఉన్న నన్ను 
స్నేహితులే గాయ పరచగా 
రక్తములో ఉన్న నన్ను 
బంధువులే వెలివేసినా (2)
నీ రక్తము లో నను కడిగి 
నీ స్వరూపము నాకిచ్చితివా (2)       " ధవళ " 


అర్హత లేని నన్ను  నీవు 
అర్హుని గా చేసితివి 
నీ మహిమ లో నిలబెట్టుటకు 
నిర్దోషిగా చేసితివి (2)
నీ సేవలో నన్ను వాడుకొని 
నీ నిత్య రాజ్యము చేర్చితివి (2)       " ధవళ  "

Comments

Popular Posts