సిలువలో వ్రేలాడే - siluvalo vrelade song lyrics

సిలువలో వ్రేలాడే నీ కొరకే 
సిలువలో వ్రేలాడే (2) 
యేసు నిన్ను పిలచుచుండే 
ఆలస్యము నీవు చేయకుము (2) 

కల్వరి శ్రమాలన్నీ నీ కొరకే 
ఘోర శిలువ మోసే కృంగుచునే 
గాయములచే బాధ నొంది 
రక్తము కార్చి హింస నొంది (2)         " సిలువలో " 

నాలుక ఎండిను దప్పి గొని 
కేకలు వేసెను దాహమని 
చేదు రసమును పానము చేసి 
చేసెను జీవ యాగమును (2)         " సిలువలో " 

అగాధ సముద్ర జలములైన 
ఈ ప్రేమను ఆర్ప జాలవు గా 
ఈ ప్రేమ నీకై విలపించుచూ 
ప్రాణము ధార బోయుచునే (2)      " సిలువలో " 

Comments

Popular Posts