పరిమళ తైలము నీవే - parimala thailamu neve song lyrics
పల్లవి :
తరగని సంతోషం నీలో
జీవ మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
తరతరములలో నీవే
నిత్య సంకల్ప సారథి నీవే
జగముల నేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
చరణం 1 :
ఉరుముచున్న మెరుపుల వంటి
తరుముచున్న శోధనలో (2)
నేనున్నా నీతో అంటూ - నీవే నాతో నిలిచావు
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీ మనసే అతి మధురం - అది నా సొంతమే
" పరిమళ "
చరణం 2 :
చీల్చబడిన బండ నుండి
నా కొదువ తీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మ శక్తి తో
కొరత లేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకుంటివి
నీ స్వాస్థ్యము లోనే చేరుటకై అభిషేకించినావు
నీ మహిమార్థం వాడ బడే నీ పాత్రను నేను ..
" పరిమళ "
చరణం 3:
వేచివున్న కనులకు నీవు కనువిందే చేస్తావని
సిద్ధ పడిన రాజుగా నీవు నాకోసం వస్తావని
నిను చూసిన వేళ నాలో ప్రాణము ఉధ్వేగ భరితమై
నీ కౌగిట ఒదిగి ఆనందము తో నీలో మమేకమై
యుగయుగములకు నీతో నేను నిలచిపోదును
" పరిమళ "
Comments