నీకేగా నా స్తుతిమాలిక - neke na sthuthi Malika
పల్లవి:
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
చరణం 1 :
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే "
చరణం 3 :
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే అంకితం (4)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
Comments
Thank you