నీవే శ్రావ్యసదనము - neeve sravyasadhanamu song lyrics

పల్లవి : 

నీవే శ్రావ్యసదనము - నీదే శాంతి సదనము
నీ దివి సంపద నన్నే చేరగా 
నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా 
నా ప్రతిస్పందనే ఈ ఆరాధన 
నా హృదయార్పణ నీకే యేసయ్యా         " నీవే " 

చరణం 1: 

విరజిమ్మే నాపై కృపాకిరణం 
విరబూసే పరిమళమై కృపా కమలం  (2)
విశ్వాస యాత్రలో ఒంటరినై 
విజయ శిఖరము చేరుటకు 
నీ దక్షిణ హస్తము చాపితివి 
నన్నాదుకొనుటకు వచ్చితివి 
నను బలపరచి నడిపించే 
నా యేసయ్యా (2)                             " నీవే "   

చరణం 2 :

నీ నీతి రాజ్యం వెదకితిని
నిండైన సాభాగ్యం పొందుటకు (2)
నలిగివిరిగిన హ్రుదయము తో 
నీ వాక్యమును సన్మానించితిని 
శ్రేయష్కరమైన దీవెన తో
శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు 
నను ప్రేమించి పిలచితివి 
నా యేసయ్యా (2)                           " నీవే " 

చరణం 3 : 

పరిశుద్ధాత్మ కు నిలయముగా 
ఉపదేశమునకు వినయముగా (2)
మహిమ సింహాసనము చేరుటకు 
వధువు సంఘముగా మార్చుమయా 
నా పితరులకు ఆశ్రయమై 
కోరిన రేవుకు చేర్పించి 
నీ వాగ్దానం నెరవేర్చితివి 
నా యేసయ్యా (2)                         " నీవే " 




Comments

Raja Gopal said…
🙏🙏🙏🙏🙏

Popular Posts