నీవే దేవా - neeve deva song lyrics

Intro : 

పాపిగా నను చూడలేక 
పాపముగా మారినావ
దోషిగా నను చూడలేక 
నా శిక్ష నీవు పొందినావా (2) 

Pre chorus 1 : 

నా తల ఎత్తుటకు - నీవు తల వంచితివే 
అర్హత నాకిచ్చుటకు - అవమాన మొందితివే 

Pre chorus 2 :  

తండ్రి తో నన్ను చేర్చుటకు - విడనాడబడితివే 
జీవము నాకిచ్చుటకు - మరణము నొందితివే 

Chorus 1 : 

నీవే నీవే నీవే దేవా 
నీవే నీవే నీవే నా యేసయ్యా (2) 

Verse 1.1

పరమును వీడి ఈ భువికి దిగివచ్చిన రక్షకుడా
మహిమను వీడి నా వెలను చెల్లించిన ప్రేమామయుడా
 
Verse 1.2

నే వెదకి రాలేననే సత్యము నెరిగి 
నీవే నా దరికి పరుగెత్తితివి 
దాసత్వము నుండి నన్ను విడిపించి 
తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి 

Chorus 2 : 

నీవే నీవే నీవే దేవా 
నీవే నీవే నీవే నా యేసయ్యా (2) 

Verse 2.1

నా స్థానము లో నీవే నిలచి 
నీ స్థానమే నాకిచ్చితివి 
సౌందర్య వంతునిగా నన్నే చేసి 
సొగాసంతా కోల్పోతివి  

Verse 2.2 

నీ బలమంతా నాకే ఇచ్చి 
బలియాగము గా నీవే మారితివి 
ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి 
దీనత నే హత్తుకొంటివి 

Chorus 3 : 

నీవే నీవే నీవే దేవా 
నీవే నీవే నీవే నా యేసయ్యా (2) 

Bridge: 

నా బలమంతా నీవే 
నా సౌందర్యము నీవే 
నా ఐశ్వర్యము నీవే - నీవే నీవే 
నా అతిశయము నీవే 
నా ఆనందము నీవే 
నా ఆధారము నీవే - నీవే నీవే  (2) 

Chorus 4 : 

యేసయ్యా యేసయ్యా యేసయ్యా 
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 

పాపిగా నను చూడలేక - పాపముగా మారినావ 
దోషిగా నను చూడలేక - నా శిక్ష నీవు పొందినావా 

నా తల ఎత్తుటకు - నీవు తల వంచితివే 
అర్హత నాకిచ్చుటకు - అవమాన మొందితివే 

తండ్రి తో నన్ను చేర్చుటకు - విడనాడబడితివే 
జీవము నాకిచ్చుటకు - మరణము నొందితివే 

నీవే నీవే నీవే దేవా 
నీవే నీవే నీవే నా యేసయ్యా (2) 









Comments

Popular Posts