కరుణా సాగర యేసయ్యా - karuna sagara yesayya song lyrics

పల్లవి 
కరుణాసాగర యేసయ్యా 
కనుపాపగా నను కాచితివి 
ఉన్నతమైన ప్రేమ తో 
మనసున మహిమగా నిలిచితివి (2)   

చరణం 1 : 
మరణపు లోయలో దిగులు చెందక 
అభయము నొందితిని నిన్ను చూచి (2) 
దాహము తీర్చిన జీవ నది 
జీవ మార్గము చుపితివి (2)            " కరుణా "

చరణం 2 : 
యోగ్యత లేని పాత్రను నేను 
శాశ్వత ప్రేమ తో నింపితివి (2) 
ఒదిగితిని నీ కౌగిలి లో 
ఓదార్చితివి వాక్యముతో  (2)          " కరుణా " 

చరణం 3 : 
అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు 
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో 
ప్రేమ నగరి లో  చేర్చుమయా (2)     " కరుణా " 

Comments

Pas Raviteja said…
కరెక్షన్ ఉన్నాయి బ్రదర్. అభయము నొందితి
Karunakar said…
It’s అక్షయ స్వాస్థ్యము

Popular Posts