ఆకాశము వైపు - akasham vaipu song lyrics

పల్లవి : 

ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను 
నా సహాయకుడవు నీవే యేసయ్యా (2) 
కలవరము నొందను నిను నమ్మియున్నాను (2)
కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2) 

చరణం 1: 
ఆకాశము పై నీ సింహాసనము ఉన్నది 
రాజ దండముతో నన్నేలుచున్నది (2) 
నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించితివి (2)
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా  
                                                           " ఆకాశము " 

చరణం 2:
ఆకాశము నుండి నాతో మాట్లాడుతున్నావు 
ఆలోచన చేత మాట్లాడుచున్నావు 
నీ మహిమ తో నన్ను నింపి
నీ దరికి నన్ను చేర్చితివి (2)
నీవుండగా ఈ లోకం లో ఏదియు 
నాకక్కరలేనే లేదయ్యా (2)                    " ఆకాశము " 

చరణం 3:
ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చియున్నది 
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది  (2) 
నా హృదయమే నీ మందిరమై తేజస్సు తో నింపితివి (2)
కృపాసనము గా నన్ను మార్చి
నాలో నిరంతరము నివసించితివి (2)    " ఆకాశము "

చరణం 4: 
ఆకాశం నీ మహిమను వివరించుచున్నది 
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది (2)
భాష లేని మాటలే స్వరమై వినబడినవి (2)
పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞాన మిచ్చుచిన్నది
                                                        " ఆకాశము " 

చరణం 5: 
కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకే నిర్మించుచున్నవు (2)
మేఘ రధములపై అరుదెంది నన్ను కొనిపోవా 
ఆశతో వేచియుంటిని - త్వరగా దిగిరావయ్యా (2) 
                                                      " ఆకాశము "











Comments

Popular Posts