సైన్యములకు అధిపతి - sainyamulaku adhipathi song lyrics

సైన్యములకు అధిపతి - నీవే గా నా స్తుతి 
నా సైన్యములకు అధిపతి - నీవే గా నా స్తుతి 
ప్రియమైన దేవా యేసయ్యా - నీకే నా  స్తోత్రము 
బలమైన రాజా యేసయ్యా - నీకే నా వందనం 
నీ వాక్యమే ఇల నా జ్ఞానము 
నీ రక్తమే ఇల నా జీవము (2)        

చరణం 1: 
పక్షమున నీవు వహించి 
మూర్ఖుల నోరు మూయించినావు 
వీరుడవే నీవు నాకుండగా 
నేనెలా భయపడుదును - నాకింకా దిగులేలను
                                                            " నా సైన్య "

చరణం 2 : 
పరిశుద్ధాత్మ లో పరవశించి
ప్రస్తుతించి నే   పాడెదను 
విశ్వాసముతో విజయాలను 
నిత్యము నే పొందెద - నీతో నే నిలిచెద    " నా సైన్య "

చరణం 3 : 
పరిశుద్ధాత్మ తో నిన్ను ప్రేమించి 
నీ పరిచర్య ను జరిగించెదను 
దీనుడనై నేను నీ యందే 
అతిశయించెదను - ఆనందించెదను        " నా సైన్య " 

Comments

Popular Posts