ప్రభువా నీ కృప తలంచుచు - prabhuva ne krupa thalanchuchu song lyrics
ప్రభువా నీ కృప తలంచుచు నే స్తుతింతును
నా జీవిత కాలమంతా నిన్నే ఘన పరుతును (2)
దేవా ప్రాణ త్యాగము ధ్యానించుచు
ప్రకటింతు నాలో ప్రాణం ఉన్నంత వరకు (2) " ప్రభు "
తడిపెను నా హృదయ సీమను నీ వాక్యపు జల్లులు
కురిసెను నీ కృప హెర్మోను మంచు వలే (2)
విరబూసే నాలో ఫలములు మెండుగా
హర్షించే నా హ్రుదయం ఆనందగాయమై (2) " ప్రభు "
నా గిన్నే నిండి పోర్లేను నీ సమృద్ధి దీవెన తో
ప్రవహించె నీ ఆత్మ జీవ నదివలెను (2)
మోడైన బ్రతుకు చిగురించె నీలోనే
నిట్టూర్పు లే నాలో స్తుతి గీతమాయెను (2) " ప్రభు "
నా హృదయ క్షేత్ర మందు కొలువైన యేసయ్యా
విరజిమ్మే నాలోన నీ ఆరని కాంతులు (2)
ఎద నిండె నాలో ఆత్మీయ తలపులలో
పులకించి నా హృదయం స్తుతి చేసి పాడెను (2) " ప్రభు "
Comments