చక్కని బాలుడమ్మా - chakkani baludamma song lyrics


చక్కని బాలుడమ్మా 
చూడ చక్కగా ఉన్నాడమ్మా (2)
కన్నీయ మరియమ్మ ఒడిలోన 
భలే బంగారు బాలుడమ్మా (2)      " చక్కని " 

గొల్లలంతా గొప్ప దేవుడంటూ 
కూడినారు పశులపాకలో 
జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ 
చేరినారు బెత్లేహేము లో (2) 
బంగారు సాంబ్రాణి బోళములు అర్పించి ఆరాధించిరి 
లోక రక్షకుడు మా రారాజని  కీర్తించి కొనియాడిరి (2) 

నింగిలోన పరిశుద్ధులంతా 
ప్రభువును స్తుతించిరి 
బెత్లెహేము పురములోన
 భక్తులంతా పూజించిరి (2)
సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ 
అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి (2) 

Comments

Anonymous said…
Nice song

Popular Posts