బాలుడు కాదమ్మో - baludu kadhammo song lyrics
పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన (2)
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) " బాలుడు "
కన్య మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు
ఆ పశువుల శాల లోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము (2)
మా మంచి కాపరని సంతోసించామే
సందడి సందడి సందడి సందడి .. సందడి చేశామే .. (2)
చుక్కను చూచి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూచి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినమమ్మా (2)
బంగారు సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పుజించామమ్మా (2)
సందడి సందడి సందడి సందడి ... సందడి చేశామే (2)
Comments