జీవుంచుచున్నావన్న పేరు unnadhi - jeevinchuchunnavanna peru unnadhi song lyrics

జీవించుచున్నావన్న పేరు ఉన్నది 
మృతడవే నీవు మృతుడవే (2) 
ఏ స్థితిలో నుండి పడిపోతివో
నీవు జ్ఞాపకము చేసికొని మారు మనస్సు పొంది 
ఆ మొదటి క్రియను చేయుమురన్నా.. 
ఆ మొదటి క్రియను చేయుమురన్నా     " జీవించు " 

చల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు 
నులి వెచ్చని స్థితి ఏల సోదరా .. (2) 
నా నోట నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను (2) 
యేసు అన్న మాటను మరువ బోకుమన్నా (2) 
                                                       " జీవించు " 
                                                
అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము
పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధునిగుండనిమ్ము (2) 
వాని వాని క్రియలకు జీతమిచ్చెనన్నాడు (2) 
యేసు అన్న మాటను మరువబోకుమన్నా (2) 
                                                      " జీవించు " 
ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురా 
దొంగ వలే వచ్చెదనని అన్నాడు (2)
గొర్రె పిల్ల రక్తము లో తెలుపు చేసికొనుమా (2)
అంతము వరకు నిలిచియుండుమా (2) 
                                                     " జీవించు " 



  

Comments

Popular Posts