నా తోడు నీవే దేవా - naa thodu neeve deva song lyrics

నా తోడు నీవే దేవా 
నా బలము నీవే ప్రభువా 
నా ధైర్యం నీవే దేవా 
నా క్షేమం నీవే ప్రభువా 
కాపాడే దైవం నీవే గా - కనుపాప గా నన్ను కాచే గా 
నీ దయలో ,  నీ కృపలో , నీ ఒడిలో నన్నిలలో 

చరణం 1: 
నాలో కన్నీరే నీ వైపు చూడగా 
నీవే యేసయ్యా సంతోషం నింపగా 
నిట్టూర్పు లోయలలో  , గాడాంధకారములో 
నీవే నా అండగా నను బలపరచగా 
నడిపించే వాక్యం నీవైతివీ 
కరుణించే దైవం నీవైతివీ 
నీ దయలో , నీ కృప లో 
చరణం 2: 
ఎన్నో కలతలే నా మదిలో నిండగా 
నీవే యేసయ్యా నా వెంటే ఉండగా 
నా భయమును తొలగించి , విశ్వాసమును కలిగించి 
నీవే నా అండగా నన్ను స్థిర పరచగా 
నీవుంటే చాలు నా యేసయ్యా 
నీ ప్రేమే నాకు చూపావయ్యా 
నీ దయలో  , నీ కృపలో  

Comments

Popular Posts