జుంటెతేనెధారల కన్నా - junte thenedharala kanna song lyrics

జుంటేతేనె ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధి నే మరువ జాలను (2) 
జీవిత కాలమంతా ఆరాధించేద 
యేసయ్య నే ఆరాధించెదా (2)                   " జుంటె " 

యేసయ్య నామమే బహు పూజనీయము 
నాపై దృష్టి నిలిపి సంతుష్టి గా నను ఉంచి (2) 
నేనెంతగానో దీవించి 
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే  (2)   " జుంటె "

యేసయ్య నామమే బలమైన దుర్గము 
నా తోడై నిలిచి క్షేమము గా నను దాచి (2) 
నేనెంత గానో కరుణించి 
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింప జేసెనే (2)      " జుంటె "

యేసయ్య నామమే పరిమళ తైలము 
నాలో నివసించి సువాసనగా నను మార్చి (2)
నేనెంత గానో ప్రేమించి 
విజయోత్సవాలతో ఊరేగింప జేసెనే (2)    " జుంటె "

Comments

Popular Posts