చూచుచున్నాము నీ వైపు - chuchuchunnaamu nee vaipu song lyrics

చూచుచున్నాము నీ వైపు 
నా ప్రియజనక - చూచుచున్నాము నీ వైపు 
చూచుచూ నీ ప్రేమ - సొంపు సువార్తను 
జాచుచు గరములు - చక్కగా నీ వైపు           " చూచు"

మేమరులమై యుంటిమి 
మార్గము వీడి - మేమందరమూ పోతిమి 
ప్రేమచేనప్పుడు - ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు - బ్రేమను జూపితివి (2)  "చూచు"

 నిను నమ్ము పాపులకు 
వారెవరైనా - నీ శరణుజొచ్చు వారలకు 
ఇనుడవు కేడెంబు - నీ జగతిలో నగుచు 
ఘనపరచు చుందువు - ఘనమైన నీ కృప (2) "చూచు" 

నీ భయము మా యెడలను 
నిలుపుము నీదు - ప్రభావ మొనరంగను 
నీ భయముచే మేము -  వైభవమొందుచు 
నే భయము లేకుండా - నీ భువిని గొన్నాల్లు (2)" చూచు "

దయ జూపి మము నెపుడు మంచివి యన్ని 
దయచేయు మెల్లప్పుడు 
దయచేయ రానివి దయచేయ మని కోర 
దయ చూపి మన్నించు దయగల మా తండ్రి(2)" చూచు "

Comments

Popular Posts