చూచుచున్న దేవుడవయ్యా - chuchuchunna devudavayya song lyrics

చూచుచున్న దేవుడవయ్యా 
నన్ను చూచినావు  (2) 
నీ పేరు ఏమిటో ఎరుగానయ్యా (2) 
నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2)    " చూచుచున్న " 

శారాయి మాటలే విన్నాను 
అబ్రహాము భార్యనయ్యాను (2) 
ఈ అరణ్య దారిలో ఒంటరినై (2) 
దిక్కులేక తిరుగుతున్న 
హాగరును నేను హాగరును (2)           " చూచుచున్న " 

ఇష్మాయేలుకు తల్లినైతిని 
అయిన వారితో  త్రోసివేయ బడితిని (2) 
కన్న కొడుకు మరణము చూడలేక 
తల్లడిల్లి పోతున్న తల్లిని నేను
అనాథ తల్లిని నేను (2)                     " చూచుచున్న "


పసివాడి మొరను ఆలకించావు 
జీవజలములనిచ్చి బ్రతికించావు (2) 
నీ సంతతిని దీవుంతునని (2) 
వాగ్దానమిచ్చిన దేవుడవు 
గొప్ప దేవుడవు (2)                         " చూచుచున్న " 



Comments

Popular Posts