చూచుచున్న దేవుడవయ్యా - chuchuchunna devudavayya song lyrics
చూచుచున్న దేవుడవయ్యా
నన్ను చూచినావు (2)
నీ పేరు ఏమిటో ఎరుగానయ్యా (2)
నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) " చూచుచున్న "
శారాయి మాటలే విన్నాను
అబ్రహాము భార్యనయ్యాను (2)
ఈ అరణ్య దారిలో ఒంటరినై (2)
దిక్కులేక తిరుగుతున్న
హాగరును నేను హాగరును (2) " చూచుచున్న "
ఇష్మాయేలుకు తల్లినైతిని
అయిన వారితో త్రోసివేయ బడితిని (2)
కన్న కొడుకు మరణము చూడలేక
తల్లడిల్లి పోతున్న తల్లిని నేను
అనాథ తల్లిని నేను (2) " చూచుచున్న "
పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు (2)
నీ సంతతిని దీవుంతునని (2)
వాగ్దానమిచ్చిన దేవుడవు
గొప్ప దేవుడవు (2) " చూచుచున్న "
Comments