చెమ్మగిల్లు కళ్ళలోన - chemma gillu kallalona

చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీల్లెంత కాలం 
కష్టాల బాట లోనే సాగదు పయనం (2)
విడుదల సమీపించెను 
నీకు వెలుగు ఉదయించెను  (2)             " చెమ్మ "

నీవు మోసిన నిందకు బదులు 
పూదండ ప్రభువు ఇచ్చును లే (2)
నీవు పొందిన వేదనలన్నీ - త్వరలో తీరి పోవునులే
నీ స్థితి చూచి నవ్విన వారు 
సిగ్గు పడే దినమొచ్చునులే                  " విడుదల " 

అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే 
అక్కర లోన ఉన్నవారికి - నీవే మేలు చేసేవులే  (2)
మొదట నీ స్థితి కొంచెమే ఉన్న 
తుదకు వృద్ధిన పొందునులే                " విడుదల "




 

Comments

Popular Posts