చాలునయా చాలునయా - chalunaya chalunaya song lyrics

చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా 
నీ కృప నాకు చాలునయా  (2)
ప్రేమా మయుడివై ప్రేమించావు 
కరుణా మయుడువై కరుణించావు (2)
తల్లిగా లాలించి తండ్రి గా ప్రేమించి (2)
ప్రేమా కరుణా నీ కృప నాకు (2)            " చాలునయా " 

జిగటగల ఊబి లో పడియుండగా
నా అడుగులు స్థిర పరచి నడిపితివయ్యా (2) 
హిస్సోపు తో నన్ను కడుగుము యేసయ్యా 
హిమము కంటెను తెల్లగా మార్చుమయ్యా (2) 
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా 
నా జీవితమంత అర్పింతు నీకయ్యా (2) 
ప్రేమా కరుణా నీ కృప చాలు               " చాలునయా " 


బంధువులు స్నేహితులు త్రోసేసినా 
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యా 
మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా (2) 
నీకేమి చెల్లింతూ నా మంచి మెస్సయ్యా 
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా (2)
ప్రేమా కరుణా నీ కృప నాకు (2)       " చాలునయా " 




Comments

Popular Posts