చాచిన చేతులతో - chachina chethulatho song lyrics

చాచిన చేతుల తో ఎదురు చూచుచుండెను 
వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక ఉండెను 

ఓ చిన్ని తనయ నేకెన్ని శ్రమలే కదయ 
నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా (2) 

చరణం 1: 
పని వారు సైతం నీ తండ్రి ఇంట 
రుచియైన అన్నము తినుచుండ గా (2) 
కనికరము చూపే వారెవరూ లేక 
శుచి లేని పొట్టుకై ఆశించినావా (2)      " ఓ చిన్ని " 

చరణం 2 : 
నీ క్షేమము ను కోరు నీ తండ్రినొదిలి
ఆ క్షామ దేశమున జీవింతువా (2) 
విస్తార ఆస్తి పై అధికారము ను విడచి 
కష్టాల బాటలో పయనింతువా (2).     " ఓ చిన్ని " 

చరణం 3 : 
పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివై యుండి 
పందులతో నీకు సహవాసమా (2) 
ఏర్పరచబడిన ప్రియ సుతునివైయుండి
పనికి మాలిన వారితో స్నేహ మా (2)    " ఓ చిన్ని " 


Comments

Popular Posts