ఆకాశ వీధుల్లో - aakasha veedhullo song lyrics
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగెను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా - హేహెయ్
లోకాల నేలే నాథుడు వెలిశాడు నా మెస్సయ్యా
దరిచేరి నాడు దీనుడై ధరలోన నా యేసయ్యా
ఇలలో జాడగా పలికింది గా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈ నాడే జన్మించె
చరణం 1:
గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ
దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ
చీకటంటి బ్రతుకు లోన చెలిమి గా చేరెనే
వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే
సదా స్నేహమై నా సొంత మై పరమాత్ముడే ఈనాడే జన్మించే
ఆహా సంతోషమే మహా దానందమే
ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగి వచ్చింది గా ఈ దినం
చరణం 2 :
వాక్యమైన దేవుడే గా బాలుడై వచ్చెను
పపామంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసు నే వేడుకో
అంతులేని చింత లేని పరమునే పొందు కో
సదా తోడుగా నీ అండగా పరమాత్ము డే ఈ నాడే జన్మించే
Comments