నే మారి పోయినా - ne maaripoyina song lyrics

పల్లవి: 
నే మారి పోయినా నీవు మారనన్నావు 
నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు  (2)

ఇది ఏమి బంధమో నీ ప్రేమ అనుబంధం 
వర్ణించలేను నీ ప్రేమను 
వివరించ లేను నీ ప్రేమను                        " నే మారి " 

నేనెంత వద్దన్నా నా వెంట పడ్డావు
వెంటాడి వెంటాడి నీ వెంట తిప్పావు  (2) 
నేను మాట్లాడకున్నా నా తోనే మాట్లాడి (2) 
నా మదిని గెలిచావు నా దైవమైనావు (2)  " నే మారి " 

నాలో ఏమి లేకున్నా 
ఏమి కోరుకున్నావు నేనేమి కాకున్నా 
నా ప్రాణమన్నావు (2) 
నేను నిన్ను ఎరుగకున్నా నీవు నన్ను ఎరిగావు (2) 
నా హృది లో నిలిచావు   నా తండ్రి వైనావు (2)     
                                                           " నే మారి " 
నేనేమి అడగకున్నా నాకన్ని ఇచ్చావు (2)
ఆశ్చర్య కార్యము లేన్నో నా పట్ల చేసావు (2)
ఊహించలేనంత ఉన్నతముగా ఉంచావు 
నన్ను నీ కొరకే అర్పించుకొందును (2) 
                

Comments

Popular Posts