క్రీస్తు జన్మించే - kreesthu janminche song lyrics

క్రీస్తు జన్మించే లోకాన అందరికీ 
క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికి !
క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న - ఏది ఏది బదులేది 

ఆకాశాన దూతల స్వరమును విని 
పశువుల శాల లో శిశువును కనుగొని 
విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు 
నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు ?          " క్రీస్తు " 

తూర్పు దిక్కున చుక్కను కనుగొని 
ఓర్పును దేవుని ఉపదేశమును విని 
వెలుగు దారి పయనించిరి జ్ఞానులు ఆనాడు 
మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు ?      " క్రీస్తు " 

Comments

Popular Posts