కళ్యాణ రాగాల సందడిలో - kalyana ragala sandadi lo song lyrics
కళ్యాణరాగాల సందడిలో - ఆనంద హరివిల్లు లో
మల్లెల పరిమళ జల్లులలో - కోయిల రాగాల లో (2)
పరిశుద్ధుడేసుని సన్నిధి లో సన్నిధి లో
నవ దంపతులు ఒక్కటవ్వ గా
స్వాగతం వధువ స్వాగతం
స్వాగతం వరుడ స్వాగతం
నీ పతిన్ చేరగా నవ వధువు స్వాగతం
నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
చరణం 1 :
నరుడు ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని
ఇరువురి కలయిక దేవుని చిత్తమై
ఒకరికి ఒకరు నిలవాలని (2)
తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని (2)
" స్వాగతం "
చరణం 2 :
సాటి లేని సృష్టి కర్త - సాటి అయిన సహాయము
సర్వజ్ఞాని అయిన దేవుడు -
సమయోచితమైన జ్ఞానముతో
సమకూర్చెను సతి పతులను
ఇది అన్నిటిలో ఘనమైనది (2) " స్వాగతం "
Comments