గూడు లేని గువ్వ లా - gudu leni guvva laa song lyrics

గూడు లేని గువ్వలా దారి తప్పితి 
గుండె చెదరిన కోవెలనై మూగ బోయితి (2) 
నీ గుండెలో దాచుమా 
నీ గూటికే చేర్చు మా (2) 
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా (2)   " గూడు " 

గువ్వలకు గూళ్లిష్టం - కోయిల కు పాటిష్టం 
నాకేమో నువ్విష్టం - నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా 
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయా (2)   " నా ప్రాణమా " 

చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం 
నీకేమో చెలిమిష్టం - నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయా 
నీవెంటుంటే ఇంకా ఇష్టమయా (2)         " నా ప్రాణమా "

Comments

Popular Posts