గొప్ప దేవుడవని - goppa devudavani song lyrics
గొప్ప దేవుడవని శక్తి సంపన్నడని
గలమెత్తి నిన్ను నేను గాన మాడేదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొని యాడేదన్
హల్లెలూయ నా యేసు నాథా
హల్లెలూయ నా ప్రాణ నాథా (2) " గొప్ప "
అద్భుత క్రియలు చేయు వాడని
ఆశ్చర్య కార్యాలు చేయ గలడని (2)
అద్వితీయుడవని ఆది సంభూతుడవని
ఆరాధించెద నిత్యం నిన్ను (2) " హల్లెలూయ"
సాగరాన్ని రెండుగా చేసినాడ ని
సాతాను శక్తులను ముంచి నాడని (2)
సర్వోన్నతుడని సర్వ శక్తి సంపన్నుడని
సాక్ష్యం గీతం నే పాడేదన్ (2) " హల్లెలూయ "
Comments