ఘనమైన నా యేసయ్యా - ghamaina naa yesayya song lyrics

ఘనమైన నా యేసయ్య 
బహు ఆశ్చర్యము లు నీ ఘన కార్యములు 
(నా) శిరము వంచి స్తుతియింతును 
నీ కృపా సత్యములను ప్రకటింతును 

నీ చేతి పను లే కనిపించే నీ సృష్టి సౌందర్యము 
నీ - ఉన్నతమైన ఉద్దేశమే 
మంటి నుండి నరుని నిర్మాణము (2)
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2)
తరతరములుగా మనుష్యులను
పోషించుచున్నావయ్యా (2) 
ఏమని వర్ణించెదను నీ ప్రేమను 
నేనెన్నని ప్రకటింతును నీ కార్యములు (2)  " ఘనమైన " 

మహోన్నతమైన సంకల్పమే 
పరనును వీడిన నీ త్యాగము 
నీ - శాశ్వత ప్రేమ సమర్పణ యే 
కలువరి సిలువలో బలి యాగము (2) 
మార్గము సత్యము జీవము నీవై 
నడిపించుచున్నావయ్యా (2) 
మానవ జాతికి రక్షణ మార్గము 
చూపించుచున్నావయ్యా (2) 
ఏమని వర్ణించెదను నీ ప్రేమను 
నేనెన్ననీ ప్రకటింతును నీ కార్యములు (2)   " ఘనమైన "

సంఘ క్షేమము కై సంచకరువు గా పరిశుద్ధాత్ముని ఆగమనం - అద్భుతమైన కార్యము లే నీవు ఇచ్చిన 
కృపా వరములు (2) 
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా (2) 
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా 
ఏమని వర్ణించెదను నీ ప్రేమను 
నేనెన్ననీ ప్రకటింతును నీ కార్యములు (2)  " ఘనమైన " 

 



Comments

Popular Posts