గమ్యం చేరాలని - gamyam cheralani song lyrics

గమ్యం చేరాలని నీతో ఉండాలని 
పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైన
శాశ్వత జీవం పొందాలని 
సాగి పోతున్నాను నిన్ను చూడాలని 
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) 

భువి అంతా తిరిగి జగమంతా నడచి 
నీ జ్ఞానముకు స్పందించాలని 
నాకున్న వన్నీ సమస్తం వెచ్చించి 
నీ ప్రేమ ఎంతో కొలవాలని (2)
అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో 
అది ఏ రూపం లో ఉందో - అది ఏ మాటల్లో ఉందో (2) 
                                        " గమ్యం చేరాలని " 

అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చినా 
శిరమును వంచి సహించాలని 
వేదన బాధలు గుండెను పిండినా 
నీదు సిలువనే మోయాలని (2)
నా గుండె కోవెల లోనా - నిన్నే నే ప్రతిష్టించి 
నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని (2)
                                      " గమ్యం చేరాలని " 

Comments

Popular Posts