గలిలయ తీరాన - galilaya theeraana song lyrics

గలిలయ తీరాన చిన్న నావ 
యేసయ్యా ఏర్పరచుకున్న నావ (2) 
యేసయ్యా సేవలో వాడబడిన 
యేసయ్యా బోధకు ఉపయోగ పడిన 
ఆ నావలో నేనుంటే చాలునయ్యా (2) 

యేసయ్యా రాకకై ఎదురుచూసిన 
యేయ్యను మోస్తూ పరవశించిన (2)
ఆత్మల సంపాదనకై వాడ బడిన 
ఆశ్చర్య కార్యాలెన్నో చూసిన 
ఆ నావలా నిన్ను చూస్తే చాలునయా (2)   " గలిలయ "

సుడిగుండాలేని ఎదురొచ్చినా 
ఫెను తుఫాను లెన్నో అడ్డొచ్చిన (2)
ఆగకుండా ముందుకే కొనసాగిన 
అలుపెరగని సేవకై సిద్ధ పడిన 
ఆ నావలో నన్ను వాడుమయ్యా (2)       " గలిలయ " 


Comments

Popular Posts