గగనము చీల్చుకొని - gaganamu cheelchukoni song lyrics

గగనము చీల్చుకొని - ఘనులను తీసుకొని
నన్ను కొనిపోగ రానైయున్న 
ప్రాణ ప్రియుడా యేసయ్యా  (2) 
నిన్ను చూడాలని ... నా హృదయమెంతో
ఉల్లసించుచున్నది (2)     
ఉల్లసించుచున్నది...                              " గగనము " 

నీ దయా సంకల్పమే - నీ ప్రేమను పంచినది 
నీ చిత్తమే నాలో నెరవెర్చుచున్నది (2) 
పవిత్రురాలైన కన్యక గా 
నీ యెదుటనే నేను నిలిచెదను  (2) 
నీ కౌగిలి లో నేను విశ్రమింతును (2).     " గగనము " 

నీ మహిమైశ్వర్యమే - జ్ఞాన సంపదనిచ్చినది 
మర్మమైయున్నది - నీ వలె రూపించుచున్నది (2) 
కళంకము లేని వధువు నై - నిరీక్షణ తో నన్ను చేరెదను (2)
యుగ యుగాలు నీతో యేలెదను (2)   " గగనము " 

నీ కృపా బాహుళ్యమే - ఐశ్వర్యమునిచ్చినది 
తేజోవాసుల సాక్ష్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో - అనాది ప్రణాళిక తో 
సీయోను లో నీతో  నే నుందును (2)    " గగనము " 
   



Comments

Popular Posts