గడచిన కాలం - gadachina kaalam song lyrics

గడచిన కాలం కృపలో మమ్ము 
కాచిన దేవా నీకే స్తోత్రము 
పగలు రేయి కనుపాప వలె 
కాచిన దేవా నీకే స్త్రోత్రము (2) 
మము కాచిన దేవా నీకే స్తోత్రము 
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) 

కలత చెందిన కష్టకాలమున  
కన్న తండ్రి వై నను ఆదరించిన 
కలుషము నాలో కాన వచ్చిన 
కాదనక నను కరుణించిన (2) 
కరుణించిన దేవా నీకే స్తోత్రము 
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)          " గడచిన " 

లోపములెన్నో దాగి ఉన్ననూ 
దాతృత్వములో నను నడిపించినా 
అవిధేయతలే ఆవరించినా 
దీవెనలెన్నో దయచేసిన (2) 
దీవించిన దేవా నీకే స్తోత్రము 
దయ చూపిన దేవా నీకే స్తోత్రము (2) 



Comments

Popular Posts