కుమ్మరీ ఓ కుమ్మరీ - kummari o kummari song lyrics
కుమ్మరీ.. ఓ కుమ్మరీ.. జగదుద్పత్తిధారి
జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా
" కుమ్మరీ "
చరణం 1 :
పనికి రాని పాత్రనని పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా నన్ను నింపు మా (2)
సువార్త లోని పాత్ర లన్నీ శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగా నుండు పాత్రగా చేసి
సత్యముతో నింపుము దేవా (2) " కుమ్మరీ "
చరణం 2 :
విలువ లేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరూ
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా జేసి (2)
ఆటంకముల నుండి తప్పించి నన్ను -
ఎల్లప్పుడూ గావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా (2)
" కుమ్మరి "
చరణం 3 :
లోకాశలతో నుండి ఉప్పొంగుచూ - మార్గంబు నే తప్పితిన్
మనుస్వేచ్ఛలన్నియును స్థిరమనుచునే -
మనస్సాక్షి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదములు పట్టితిన్
ఆ... నీ పాదములు పట్టితిన్ (2) " కుమ్మరి "
Comments