కృపలను తలంచుచూ - krupalanu thalanchuchu song lyrics

కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని 
కృతజ్ఞత తో స్తుతింతున్ (2)              " కృపలను "


రూపింప బడుచున్నా యే 
ఆయుధముండినను ... (2) 
నాకు విరోధమై వర్ధిల్లదు యని 
చెప్పిన మాట సత్యం .. ప్రభువు (2)    " కృపలను " 

కన్నీటి లోయలలో 
నే కృంగిన వేళలలో ... (2) 
నింగిని చీల్చి వర్షము పంపి 
నింపెను నా హ్రుదయం .. యేసు (2)  " కృపలను " 

సర్వోన్నతుడైన నా 
దేవుని తో చేరి ... (2) 
సతతము తన కృప వెల్లడి చేయ 
స్తుతులతో నింపెను ... ఇలలో (2)    " కృపలను " 

హల్లెలూయ ఆమెన్ .. ఆ ఆ 
నాకెంతో ఆనందమే (2)
సియోను నివాసం నాకెంతో ఆనందం 
ఆనందమ్ ఆనందమే ఆమెన్ 
ఆనంద మానందమే (2)                 " కృపలను " 



Comments

Popular Posts