కృపగల దేవా - krupa gala deva song lyrics

కృపగల దేవా దయగల రాజ 
చేరితి నిన్నే బహు ఘన తేజ 
నీ చరణములే నే కోరితిని - నీ వరములనే నే వేడితిని
సర్వాధికారివి నీవే దేవా - నా సహకారివి నీవే ప్రభువా 
నా కోరికలే సఫలము చేసి - ఆలోచనలే నెరవేర్చితివి 
అర్పించెదను నా సర్వమును - నీకే దేవా 
ఆరాధించి ఆనందించెద - నీలో దేవా 


చరణం : 
త్రోవను చూపే తారవు నీవే - గమ్యము చేర్చే సారథి నీవే
జీవన యాత్ర శుభప్రదమాయే - 
నా ప్రతి ప్రార్ధన పరిమళమాయే 
నీ ఉదయకాంతి లో నను నడుపుము 
నా హృదిని నీ శాంతి లో నింపుము         " కృప " 

కృప చూపి నన్ను అభిషేకించి - 
వాగ్దానములు నెరవేర్చినావే 
బహు వింత గా నను ప్రేమించి నావే -
బలమైన జనముగా నను మార్చి నావే 
నీ కీర్తి జగమంత వివరింతును - 
నీ  దివ్య మహిమలను ప్రకటింతును      " కృప " 

నా యేసు రాజా వరుడైన దేవా - 
మేఘాల మీద దిగివచ్చువేళా 
ఆకాశ వీధిలో లో కమనీయ కాంతి లో - 
ప్రియమైన సంఘమై నిను చేరెదను 
నిలిచెదను నీతోనే సీయోను లో - 
జీవింతు నీతోనే యుగ యుగములు     " కృప " 


Comments

Popular Posts